అనుష్క శర్మ.. మరో ఘనత!

0
31

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ వరుససినిమాలు, విజయాలతో దూసుకుపోతోంది. ఓ పక్క సినిమాల్లో నటిస్తూ మరోపక్క నిర్మాతగా వ్యవహరిస్తూ వూపిరి సలపనంత బిజీ అయిపోయింది.బాలీవుడ్‌ లక్కీ గర్ల్‌గా పేరుతెచ్చుకున్న అనుష్క తన వృత్తిలో మరో ఘనత సాధించింది. ‘ఎంట్రప్రెన్యూర్‌’ అనే పత్రిక కవర్‌పేజీపై స్థానం దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ మ్యాగజైన్‌ కవర్‌పేజ్‌పై షారుక్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌లు మాత్రమే స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత లిస్ట్‌లో అనుష్క చేరిపోయింది. అంతేకాదు ఇలాంటి బిజినెస్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజ్‌పై చోటుదక్కించుకున్న మొదటి బాలీవుడ్‌ నటి కూడా అనుష్క కావడం విశేషం. ఈ విషయాన్ని అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ ఫొటో షేర్‌ చేసింది. ప్రస్తుతం అనుష్క తన నిర్మాణ సంస్థ ‘క్లీన్‌ స్లేట్‌ ఫిలింస్‌’ నిర్మిస్తున్న ‘ఫిల్లోరి’ సినిమాలో నటిస్తోంది. మార్చి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here