అనుష్క మంచి దెయ్యం అయిపోయారు

0
24

కథానాయిక అనుష్క శర్మ మంచి దెయ్యంగా మారిపోయారు. ఇదేంటి అనుకుంటున్నారా? అనుష్క తన సొంత నిర్మాణ సంస్థ నుంచి తొలి చిత్రంగా ‘ఎన్‌హెచ్‌ 10’ని నిర్మించారు. ఈ చిత్రం హిట్‌ అందుకుంది. ఇప్పుడు ఆమె ‘ఫిల్లౌరి’ అనే మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క శర్మ, దిల్జిత్‌ దొసాంజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో.. అనుష్క మంచి స్నేహపూర్వకమైన దెయ్యంగా కనిపించారు.

సూరజ్‌ శర్మకు దోషం ఉండటంతో అతడికి ఓ చెట్టుతో మొదటి పెళ్లి చేస్తారు. ఇదే అతడికి సమస్యలు తెచ్చిపెడుతుంది. చెట్టుని పెళ్లి చేసుకున్న తర్వాత సూరజ్‌ను దెయ్యంగా మారిన అనుష్క వెంటాడుతుంది.తన నివాసం ఆ చెట్టేనని, చెట్టును పెళ్లి చేసుకుని తెలియకుండానే తనను పరిణయం ఆడాడని ఆరోపిస్తుంది. తర్వాత అనుష్క దెయ్యం కాకముందు దిల్జిత్‌తో ప్రేమలో ఉన్న సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. సరదాగా ఉన్న ఈ ట్రైలర్‌కు పలువురు సినీ ప్రముఖుల నుంచి ట్విటర్‌ వేదికగా ప్రశంసలు లభించాయి. మార్చి 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here