అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయీ

0
5

భాజపా సీనియర్‌ నేత, మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీని సోమవారం దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో చేర్చారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఎయిమ్స్‌లో చేరారని వైద్యులు చెప్పినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఎయిమ్స్‌ సంచాలకులు డా.రణ్‌దీప్‌ గులేరియా ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా డా.గులేరియా వాజ్‌పేయీకు వ్యక్తిగత ఫిజీషియన్‌గా ఉంటున్నారు.

LEAVE A REPLY