అధికారులను ఆదేశించిన మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల

0
25

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు సూచించారు. వివిధ అభివృద్ధి పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, మార్కెటింగ్ తదితర శాఖల పనితీరుపై శనివారం శాసనసభ హాలులో సమీక్షా సమావేశం జరిగింది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఉపాధి హామీ పథకం తీరుతెన్నులు, అంగన్‌వాడీ కార్యక్రమాలు, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద మంజూరైన నిధుల వినియోగం తదితర అంశాలను మంత్రి సమీక్షించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో వందకు వంద శాతం మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మూడు జిల్లాలను తెలంగాణలో మోడల్ జిల్లాలుగా మార్చాలని చెప్పారు. ఈ దిశగా సిద్దిపేట తర్వాత దుబ్బాక, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాలు ముందంజలో ఉన్నాయన్నారు

LEAVE A REPLY