అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

0
26

తమిళనాడు వైపు ‘వార్దా’ వెళుతున్నా, రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు వణుకు తప్పదన్న అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తీవ్ర ముంపు, చిత్తూరు, కడపలకు భారీ వర్ష‘గండం’ పొంచి ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలను చేపట్టింది. తుఫాను గమనం, ప్రభావాన్ని తెలిపే ప్రత్యేక టెక్నాలజీ ఆధారంగా..ఎక్కడికక్కడ అధికారయంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. తుఫాను ప్రభావిత నాలుగు జిల్లాలకు ఐఏఎ్‌సలను ప్రత్యేకాధికారులుగా నియమించిన సీఎం చంద్రబాబు.. ఆ జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

LEAVE A REPLY