అగస్టాలో ప్రముఖ ఫ్యామిలీకి 113 కోట్లు

0
17

అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో ఒక ప్రముఖ రాజకీయ కుటుంబానికి రూ.113, 19,25,980(16.68 మిలియన్ల అమెరికన్ డాలర్లు) చేతులు మారాయని ఈ ఒప్పందంలో కీలక మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ పేర్కొన్నట్లు సమాచారం. యూపీఏ ప్రభుత్వ హయాంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ పార్టీ కుటుంబానికి ఈ మొత్తం చెల్లించినట్లు ఆయన తన డైరీల్లో రాసుకున్నారు. మిషెల్ పంపిన ఈ మెయిల్స్, ఆయన డైరీల్లో రాసుకున్న వివరాలు ఈ సంగతిని చెప్తున్నాయి. అగస్టా వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు 2010లో యూపీఏ సర్కార్ రూ.3600 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నది. 2008 మార్చి 15న మిషెల్ డైరీలో ప్రభుత్వానికి బయట ఉన్న నేతల పేర్లు రాసుకున్నారు. సోనియాగాంధీ, తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్ ప్రస్తావన ఉంది.

LEAVE A REPLY