అఖిల్ నిశ్చితార్థంలో.. టాప్ హీరోయిన్ డాన్స్!

0
33

అక్కినేని వారసులు.. నాగచైతన్య, అఖిల్‌లు త్వరలో పెళ్లి కొడుకులు కాబోతున్నారు. అయితే, డిసెంబర్ 9వ తేదీన అఖిల్ నిశ్చితార్థం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, పలువురు ముఖ్య రాజకీయ నేతలు హాజరు కానున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి సినీ రంగం నుంచి కేవలం 30మంది మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. కాగా, నిశ్చితార్థం పూర్తైన తరువాత సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆధ్వర్యంలో.. ఒక సంగీత కార్యక్రమం ఉంటుందట. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా నృత్యం చేయనుందట. ఈ కార్యక్రమంలో తమన్నాతో పాటు మంచు లక్ష్మి కూడా కాలు కదపనుందట. అంతేకాదు, ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు అంకిత్ తివారి, చిన్మయి, సమీర్ భరద్వాజ్, ధనుంజయ్‌లు అక్కినేని హీరోల సూపర్‌హిట్ పాటలు ఆలపించనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానించకపోయినా.. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేస్తారని టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here