అక్రమ నిర్మాణాలపై ఆస్తి పన్ను

0
21

ప్రభుత్వం కల్పించే అన్నిరకాల మౌలిక వసతులను అనుభవిస్తూ ఆస్తి పన్ను మాత్రం కట్టనంటే కుదరదిక. అది ప్రభుత్వ భూమైనా.. వక్ఫ్‌బోర్డు స్థలమైనా.. మరేదైనా అందులో ఇల్లు కట్టుకుని నివసించేవారు ఇక నుంచి తప్పకుండా ఆస్తి పన్ను కట్టాల్సిందే. ఇప్పటికే అక్రమ నిర్మాణాల నుంచి వసూలు చేయాల్సిన ఆస్తి పన్నుపై మున్సిపల్ చట్టంలో నిబంధన ఉన్నది. అయితే, పురపాలక శాఖ ఒక అడుగు ముందుకేసి.. ప్రతి అంశానికి సంబంధించిన నిబంధనలను వివరణాత్మకంగా రూపొందించింది. చట్టంలోని ప్రతి అంశాన్ని విపులంగా విశదీకరించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వర్తించేలా ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది

LEAVE A REPLY