అక్రమ ఆస్తులు రూ.50 కోట్లపైనే..

0
20

విశాఖపట్నం: కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. ఆమె సంపాదించిన అక్రమ ఆస్తులు రూ. 50 కోట్లకుపైనే ఉంటాయనే ప్రాథమిక అంచనాకు అనిశా అధికారులు వచ్చారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అవినీతి నిరోధ¿క శాఖ కేంద్రీయ పరిశోధన సంస్థ (సీఐయూ) బృందం కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఏకకాలంలో బుధవారం ఈ దాడులు నిర్వహించింది. విచారణ అధికారి, అనిశా సీఐయూ డీఎస్పీ ఎస్‌.వి.వి.ప్రసాద్‌ ఆధర్యంలో ఈ దాడులు కొనసాగాయి. కర్నూలులోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంతోపాటు, స్వరాజ్యలక్ష్మి అద్దెకు నివాసం ఉంటున్న అపార్టుమెంటులో సోదాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని మర్రిపాలెంలోని ఓ గృహాన్ని సీజ్‌ చేశారు. లాకర్లు తనిఖీ చేయాల్సి ఉందని.. స్వరాజ్యలక్ష్మిని గురువారం విశాఖ రప్పించి ఆమె సమక్షంలోనే సీజ్‌చేసిన గృహంతోపాటు లాకర్లు తెరిపించి సోదాలు నిర్వహిస్తామని విచారణ అధికారి ప్రసాద్‌ తెలిపారు. బంగారం, నగదు, ఇంటిస్థలాలు, గృహాలు ఇతర ఆస్తులు ఎంతెంత ఉన్నాయనే దానిపై.. గురువారం స్పష్టత వస్తుందని తెలిపారు.

LEAVE A REPLY