అక్కినేని ‘అగస్టా’

0
16

తెలుగు సినీ కథానాయకులు నాగచైతన్య మంగళవారం కొండాపూర్‌ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తాను కొనుగోలు చేసిన ఎంవీ అగస్టా ద్విచక్ర వాహనం (సూపర్‌ బైక్‌) రిజిస్ట్రేషన్‌ కోసం ఆయన ఉదయం 11.30 కు కార్యాలయానికి శిరస్త్రాణం ధరించి స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంవీఐలు సాయిరాంరెడ్డి, సత్యనారాయణలు నాగచైతన్యకు వాహన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ గురించి వివరించారు. అనంతరం వాహన రిజిస్ట్రేషన్‌ కోసం నాగచైతన్య ఫొటో దిగి సంతకాలు చేశారు. సుమారు రూ.27 లక్షలు విలువ చేసే అగస్టా ద్విచక్ర వాహనంకు రూ.4.5లక్షల జీవితకాల రోడ్‌ ట్యాక్స్‌ను చెల్లించారని ఎంవీఐ సాయిరాంరెడ్డి తెలిపారు. నాగచైతన్య ద్విచక్రవాహనానికి టీఎస్‌07 ఎఫ్‌ఎం 2003 నంబర్‌ కేటాయించినట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY