అక్కడ అంతా రజనీనే కనిపిస్తారు

0
18

తమిళనాడులోని చెన్నైలో అడుగుపెడితే అంతా సూపర్‌స్టార్‌ రజనీకాంతే కనిపిస్తారని కథానాయిక అమీజాక్సన్‌ అన్నారు. ఈ బ్రిటిష్‌ భామ మంగళవారం తన పుట్టినరోజును జరుపుకొన్నారు. రజనీ, అమీ జంటగా నటిస్తున్న ‘2.0’ సినిమా సెట్‌లో ఆమె పుట్టినరోజు వేడుకను చిత్ర బృందం నిర్వహించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమీ రజనీ గురించి మాట్లాడారు. ‘చెన్నైలో అడుగుపెడితే అంతా రజనీకాంతే కనిపిస్తారు. ప్రపంచం ఆయన్ను సూపర్‌ హ్యూమన్‌ అనుకోవడం కరెక్ట్‌. రజనీ మంచి నటుడు, దయకలిగిన వ్యక్తి.. ఆయన విజయాన్ని మనం లెక్కకట్టలేం. ఆయనతో ఓ చిన్న సంభాషణ జరిపినా.. జీవితంలో కృతజ్ఞతాభావానికి ఉన్న విలువ తెలుస్తుంది. రజనీ ముందు నటించడమంటే కష్టమే.. కానీ ఆయన భయపెట్టే వ్యక్తి కారు. శ్రద్ధ తీసుకుని చెప్పే వ్యక్తి’ అన్నారు.

సల్మాన్‌, అమీ ప్రేమలో ఉన్నారని, అందుకే ‘2.0’ ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమానికి సల్మాన్‌ వచ్చారని కొద్దిరోజుల క్రితం పుకార్లు వచ్చాయి. ఈ వార్తలకు అమీ పరోక్షంగా సమాధానం ఇచ్చారు. ‘ఇది ప్రతిష్ఠాత్మక చిత్రం కాబట్టే సల్మాన్‌ సపోర్ట్‌ చేశారని అనుకుంటున్నా. ఆయన చూపిన ఆదరణ అద్భుతం. సల్మాన్‌ గొప్ప నటుడు, పెద్ద స్టార్‌. ‘కిక్‌’లో సల్మాన్‌తో నటించే అవకాశం వచ్చింది. కానీ ‘ఐ’ చిత్రం వల్ల అందులో నటించలేకపోయా. సల్మాన్‌తో కలిసి పనిచేయాలన్నది నా కల’ అని చెప్పారు.

LEAVE A REPLY