అంబులెన్స్ లేక బైక్‌పైనే మృతదేహం తరలించిన బంధువులు

0
47

మధ్యప్రదేశ్ రాష్ట్రం సిద్ధి జిల్లా అమిలియాలోని ఓ బ్యాంకులో తన పింఛన్ తీసుకునేందుకు సోమవారం భారీ లైన్లో నిలబడిన వృద్ధురాలు (70) ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయారు. అధికారులు ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి చేరవేయడానికి అంబులెన్స్, శవాల వాహనంగానీ సమకూర్చకపోవడంతో బంధువులే శవాన్ని మధ్యలో పెట్టుకొని ద్విచక్రవాహనంపై తీసుకెళ్ల డంతో స్థానికుల హృదయాలు ద్రవించాయి. గత ఏడాది ఒడిశాలో వ్యక్తి శవాన్ని బంధువులు కట్టెకు కట్టుకొని తరలించారు. మాంఝీ అనే వ్యక్తి తన భార్య శవాన్ని భుజంపై వేసుకుని, కూతురును వెంటబెట్టుకొని 10 కిలోమీటర్లు రోడ్డు వెంట నడిచిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని తుమకూరులో మహిళ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన అమాన వీయ ఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటనలతో సుమారు ఆరునెలల క్రితమే మృతదేహాలను స్వస్థలాలకు ఉచితంగా చేరవే సేందుకు తెలంగాణ ప్రభుత్వం పార్థివ ఉచిత వాహన సేవ ఏర్పాటుచేసింది.

LEAVE A REPLY