అంధత్వాన్ని ఎదిరించాడు మారథాన్ గెలిచాడు

0
19

అతను అంధుడు.. మీటర్ దూరం మించి కనిపించదు.. రంగుల వ్యత్యాసం పోల్చుకోవడం చాలా కష్టం. అతి అరుదైన జన్యు వ్యాధితో వచ్చిన అంధత్వం అతని ఆత్మవిశ్వాసాన్ని మాత్రం బ్బతీయలేకపోయింది. చిన్నతనం నుంచి పరుగుపందెంలో పాల్గొన్న అనుభవంతో కష్టపడి సాధన చేశాడు.. ప్రతిష్ఠాత్మక బోస్టన్ రేస్‌ను పూర్తి చేశాడు. అతనే బెంగళూరుకు చెందిన 31 ఏండ్ల సాగర్ బహేతి. సోమవారం ముగిసిన బోస్టన్ మారథాన్‌ను పూర్తిచేసిన తొలి భారత అంధుడిగా బహేతి అరుదైన రికార్డు నెలకొల్పాడు. పాక్షిక అంధుల విభాగంలో పోటీపడిన బహేతి రేసును 4 గంటల 14 నిమిషాల 7 సెకన్లలో పూర్తి చేసి 18వ స్థానంలో నిలిచాడు. ఈ మారథాన్‌లో సుమారు 30,000 మంది పాల్గొన్నారు. నాలుగేండ్లకు ముందువరకు బహేతి అందరిలా ఆడుతూ పాడుతూ సరదాగా గడిపాడు.

LEAVE A REPLY