అందరూ ఉన్న అనాథ మాతృదినోత్సవాన ఓ తల్లి మూగవేదన

0
8

అందరూ ఉన్న ఓ అనాథ ఆమె. ఒక కొడుకు, కుమార్తెకు జన్మనిచ్చింది. రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేసింది. రెక్కలు వచ్చిన పిల్లలు తల్లి బాగోగులు మరిచారు. భర్త వదిలేయడంతో గుండె దిటవు చేసుకొంది. పాచిపనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆదివారం బీకేగూడ ఉద్యానవనం దగ్గర ఎస్సార్‌నగర్‌ సీనియర్‌ సిటిజన్స్‌ ఆధ్వర్యంలో మాతృదినోత్సవం నిర్వహించారు. కార్పొరేటర్‌ కొలను లక్ష్మి తల్లుల ఔన్నత్యం గురించి మాట్లాడుతూ… పిల్లలు తల్లిని విస్మరించరాదని వివరిస్తున్నారు. అక్కడ ఆగి ఈ మాటలు విన్న చంద్రకళకు దుఃఖం ఆగలేదు. తన చేతిలో ఉన్న బుట్టను అడ్డు పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది. ఇది గమనించిన ‘న్యూస్‌టుడే’ ఆమెను కారణం అడగ్గా.. వివరాలు తెలిపింది. కుషాయిగూడలో స్థిరపడిన పిల్లలు మూడేళ్లుగా తనను పట్టించుకోవడంలేదని, కనీసం ఒక్కసారైనా చూడటానికి రాలేదని వాపోయింది.

LEAVE A REPLY