అందరికీ 500 నోట్లే ఇవ్వాలి.. నేటి నుంచే పంపిణీ

0
26

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పెన్షనర్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. గురువారం వెలగపూడిలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. శుక్రవారం రాష్ట్రానికి రూ.2,500కోట్ల మేరకు కొత్త నోట్లు వస్తున్నాయని, అందులో రూ.500కోట్ల మేరకు 500 రూపాయల నోట్లు ఉన్నాయని సీఎం చెప్పారు. ఆ మొత్తం పంపిణీలో పెన్షనర్లకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. పెన్షనర్లకు రూ.500 నోట్లు ఇవ్వాలని ఇప్పటికే బ్యాంకులకు నిర్దేశించామని సీఎం చెప్పారు. జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకొని పెన్షనర్లందరికీ మూడు రోజుల్లోగా డబ్బు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు

LEAVE A REPLY