అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర

0
26

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దాదాపు అక్కడక్కడే ఉన్నా, దేశంలోమాత్రం ఉరుకులు పెట్టింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ వారంలో దాదాపు 60 పైసలు పతనం కావడమే దీనికి కారణం. న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో బంగారం ఔన్స్‌ (31.1గ్రా) ధర 11వ తేదీతో ముగిసిన వారంలో 1,316 డాలర్ల నుంచి 1,318 డాలర్లకు పెరిగింది (వారం మధ్యలో ఒక దశలో 1,328 స్థాయిని చూసింది).

అయితే ఇదే కాలంలో భారత్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్స్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో 10 గ్రాముల బంగారం ధర రూ.404 పెరిగి రూ. 31,518కి ఎగసింది. ఇక ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.455 ఎగసి వరుసగా రూ. 31,615, రూ.31,465 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర రూ.1,110 పెరిగి రూ. 40,290కి చేరింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఈ వారంలో దాదాపు 60 పైసలు బలహీనపడి 67.40ని చూడ్డం ఆయా అంశాలకు నేపథ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here