అంతర్జాతీయ క్రికెట్‌కు మిస్బా గుడ్‌బై

0
29

పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈనెల 21 నుంచి వెస్టిండీస్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీసే ఆఖరిదని తెలిపాడు. 2010లో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన 42 ఏండ్ల మిస్బా ఇప్పటి వరకు 53 మ్యాచ్‌ల్లో టీమ్‌ను నడిపించాడు. 24 మ్యాచ్‌ల్లో పాక్‌కు విజయాలను అందించాడు. మిస్బా ఇదివరకే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినా.. దేశవాళీ మ్యాచ్‌లు ఆడతానని స్పష్టం చేశాడు. స్పాట్ ఫిక్సింగ్‌తో తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన స్థితిలో నాయకత్వ పగ్గాలు అందుకున్న మిస్బా.. పాక్ జట్టును ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిపాడు. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశా. చాలాసార్లు జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యా. ఇలాంటి పరిస్థితుల నుంచి మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకున్నా. ఇన్నేండ్ల కాలంలో నా ప్రదర్శన బాగా సంతృప్తినిచ్చింది అని మిస్బా పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here