అండర్సన్‌.. ముందు నీ సంగతి చూసుకో

0
18

భారత టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ఇంగ్లాండ్‌ బౌలర్‌ అండర్సన్‌ వ్యాఖ్యలు పరిణితి లేనివని కోహ్లీ చిన్నప్పటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ విమర్శించారు. అండర్సన్‌ ముందు తన ప్రదర్శనపై పరిశీలన చేసుకోవాలని సూచించారు. బుధవారం పీటీఐతో మాట్లాడుతూ కోహ్లీపై అతని వ్యాఖలు చిన్నపిల్లల మాటల్లా ఉన్నాయన్నారు. భారత్‌లో అతడు వికెట్లు సాధించడంలేదని.. ఒకవేళ అతను మంచి బౌలర్‌ అయితే ఇండియాలోనూ వికెట్లు తీయాలని చెప్పారు.కేవలం ఇంగ్లాండ్‌లో వికెట్లు తీయడమే గొప్పబౌలర్‌కి ఉండాల్సిన ప్రామాణికం కాదని వ్యాఖ్యానించాడు. కోహ్లీ ప్రతి టెస్టు మ్యాచ్‌లోనూ పరుగులు సాధిస్తుండటం అతడు జీర్జించుకోలేకపోతున్నాడని.. ఆస్ట్రేలియాలో విరాట్‌ ఐదు శతకాలు సాధించిన సంగతి మర్చిపోవద్దని గుర్తు చేశారు.

LEAVE A REPLY