అంచనాల కమిటీలో ఎంపీ కవితకు మళ్లీ స్థానం

0
23

పార్లమెంటరీ సభ్యులతో కూడిన అంచనాల కమిటీలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి స్థానం సంపాదించారు. ఆమె పదవీ కాలాన్ని పొడిగిస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఉత్తర్వులు జారీచేశారు. మురళీ మనోహర్ జోషీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీ 2014 ఆగస్టు 14న ఏర్పడింది. అప్పటి నుంచి ఎంపీ కవిత సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 2014 ఆగస్టు 14న ఏర్పడిన కమిటీ పదవీకాలం 2015 ఏప్రిల్ 30న ముగిసింది. మళ్లీ 2015 మే 1వ తేదీ నుంచి గత సంవత్సరం ఏప్రిల్ 30 వరకు పనిచేసిన కమిటీలోనూ ఆమె సభ్యురాలిగా కొనసాగారు. గత సంవత్సరం మే 1 నుంచి వచ్చే నెల 30వ తేదీతో ముగిసే కమిటీలోనూ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

LEAVE A REPLY