అంగారక గ్రహంపై పరిశోధనల కోసం నాసా

0
40

అంగారక గ్రహంపై పరిశోధనల కోసం నాసా పంపించిన మార్స్ రోవర్ చక్రాలకు పగుళ్లు వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్యూమినియంతో తయారైన ఈ చక్రాల ఫొటోలను మార్చి 19న విశ్లేషించగా ఎడమవైపున ఉన్న మధ్య చక్రానికి పగుళ్లు కనిపించాయన్నారు. జనవరి 27న పరీక్షించినప్పుడు పగుళ్లు లేవన్నారు. అయితే వీటితో ఇబ్బందేమీ లేదని, రోవర్‌కు ఉన్న ఆరు చక్రాలు ఇంకా చాలా కాలంపాటు పనిచేయగలుగుతాయని క్యూరియాసిటీ ప్రాజెక్ట్ మేనేజర్ జిమ్ ఎరిక్‌సన్ చెప్పారు. తమ పరిశోధనలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. ప్రస్తుతం రోవర్ ఆ గ్రహంపై ఉన్న షార్ప్ పర్వతం ఎక్కుతున్నదని, అక్కడి పురాతన, ఆధునిక భౌగోళిక పొరల నమూనాలను సేకరించి విశ్లేషించనున్నదని వివరించారు. 2012 ఆగస్టు లో అంగారకుడిపై దిగినప్పటి నుంచి మార్స్‌రోవర్ ఇప్పటివరకు 16 కిలోమీటర్లు తిరిగింది. మరో ఆరు కిలోమీటర్లు తిరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY