అంగారక గ్రహంపైకి మ రి కొన్నేండ్లలో

0
50

గ్రహంపైకి మ రి కొన్నేండ్లలో మనుషులను పంపాలని పరిశోధనలు సాగిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా), అక్కడ వారు నివా సం ఉండేందుకు మంచు ఇండ్లను కట్టాలని భావిస్తున్నది. అంగారక గ్రహంపై ఉష్ణోగ్రతల్లో తేడాలను తట్టుకోవడం, అక్కడి అధిక రేడియేషన్ నుంచి కాపాడటం, ఇతర ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఈ ఐస్ హోమ్స్ సమర్థంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవి గాలితో నింపిన ట్యూబ్‌ల వలె ఉంటాయని, వాటి చుట్టూ ఉండే గదుల్లో శీతల నీరు నింపుతామని చెప్పారు. గ్రహంపై పలు ప్రాంతాల్లో తక్కువ లోతులోనే మంచు రూపంలో నీటి పొర ఉండటం కలిసొచ్చే అంశమన్నారు. ఈ డిజైన్‌తో అనేక లాభాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

LEAVE A REPLY