అంగన్‌వాడి.. ‘పోషకం’ ఏదీ?-పేరుకు సన్నబియ్యం.. ముద్దగా అన్నం

0
50

అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందటం లేదు. చాలాచోట్ల పిల్లలు, గర్భిణులకు మధ్యాహ్న భోజనంలో దొడ్డు బియ్యం, నీళ్లచారునే  వడ్డిస్తున్నారు. అంగన్‌వాడీలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎక్కడా సరఫరా అవుతున్న దాఖలాలు లేవు. కొన్నిచోట్ల సన్నబియ్యం పేరుతో సరఫరా చేస్తున్న బియ్యం వండిన తరువాత ముద్దగా మారుతోంది.  పలుచోట్ల పాలు సరఫరా కావంలేదు. దీనికితోడు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు చిన్నసైజులో ఉన్న కోడిగుడ్డు అందజేస్తున్నారు. మరోవైపు కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది సరుకులను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటుంటే.. ఇంకొన్ని చోట్ల తక్కువ పరిమాణంలో సరుకులు అందచేసి లెక్కలు మాత్రం సరిగా రాయాలని అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్న దాఖ లాలు బయటపడ్డాయి. ‘సాక్షి’ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు అంగన్‌వాడి కేంద్రాలను సందర్శించినపుడు పలు విషయాలు వెలుగుచూశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here